chemadunpa fry

0
341

635768732394702577

చామదుంపలు పుట్నాల వేపుడు

 

కావలసిన పదార్థాలు:

చామదుంపలు – పావు కేజీ, పుట్నాల పప్పు – అర కప్పు, పల్లీలు – అర కప్పు, జీడి పప్పు – కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి – మూడు టేబుల్‌ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు – నాలుగు, ఎండుమిరపకాయలు – మూడు, జీలకర్ర – మూడు టేబుల్‌ స్పూన్లు, పసుపు – చిటికెడు, ఉప్పు – రుచికి తగినంత, మినప్పప్పు – మూడు టేబుల్‌ స్పూన్లు, కారం – టీస్పూను, నూనె – తగింత.

తయారుచేసే విధానం: ఒక కడాయిలో మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు కొద్దిగా నూనె వేసి వేగించి, చల్లారాక అందులో పుట్నాల పప్పు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. మరో కడాయిలో నూనె పోసి ఉడికించిన చామదుంప ముక్కలను దోరగా వేగించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ వేగించిన ముక్కల్లో పుట్నాల మిశ్రమం పొడి, ఎండుకొబ్బరి పొడి, పసుపు, కారం, వే గించిన జీడిపప్పు వేసి కొత్తిమీర చల్లుకోవాలి.

NO COMMENTS

LEAVE A REPLY