కష్టాల్లో “ఛార్మి”

0
292

charmi-hot-photoshoot61384152471

 

ఛార్మింగ్ లేడీ ఛార్మిని టాలీవుడ్ దాదాపుగా మ‌ర్చిపోయే స్టేజీకి వ‌చ్చేసింది. ఛార్మి అన‌గానే నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు లైట్ తీసుకొంటున్నారు. హీరోలు ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశారు. అయితే ఛార్మికి ఓ స్టాండ‌ర్డ్ బ్యాచ్ ఉంటుంది కదా?  వాళ్ల  సినిమాల్లో ఏదోలా అవ‌కాశాలు జేజిక్కించుకొంటోంది. అలా పూరి జ‌గ‌న్నాథ్ సినిమాజ్యోతిల‌క్ష్మిలో బుక్క‌య్యింది ఛార్మి. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌పై కి వెళ్ల‌తోతోంది. ఈలోగా ఛార్మిని స్లిమ్ అవ్వ‌మ‌ని ఆదేశించాడ‌ట పూరి. క‌నీసం ప‌ది కిలోలు త‌గ్గ‌క‌పోతే.. షూటింగ్ కి వెళ్లొద్దు అని లిటికేష‌న్ పెట్టాడ‌ట‌. దాంతో ఛార్మి ఇప్పుడు ఒళ్లు హూన‌మ‌య్యేలా క‌ష్ట‌ప‌డుతోంది. జిమ్ములో ఎక్స‌ర్ సైజులూ గట్రా చేస్తోంది. ఆహార అల‌వాట్ట‌లోనూ భారీ మార్పులు వ‌చ్చాయ‌ట‌. ఓపూట కేవ‌లం ప‌ళ్ల‌తోనే స‌రిపెట్టుకొంటోంద‌ట‌. ”పూరి డైట్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉంటారు. ఈమాత్రం క‌ష్ట‌ప‌డ‌క‌పోతే ఎలా..??  అందుకే ఇలా క‌స‌ర‌త్తులు చేస్తున్నా..” అని చెప్పుకొచ్చింది ఛార్మి. మొత్తానికి జ్యోతిల‌క్ష్మి ద‌య వ‌ల్ల‌ ఛార్మి స్లిమ్ అవుతోంద‌న్న‌మాట‌.

NO COMMENTS

LEAVE A REPLY