జగన్ కు 15వందల కోట్లకు ఛార్జ్ షీట్ — ఈడి

0
317

ys-jaganmohan-reddy_3

ఆస్తుల కేసులో వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఈడీ షాక్ ఇవ్వబోతోందా..? మనీలాండరింగ్ చట్టం కింద 15 వందల కోట్ల వరకు ఆస్తులు ఈడీ అటాచ్ చేసే అవకాశం ఉందా..? ఈడీ జోరు చూస్తుంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మరోసారి జగన్ ఆస్తుల అటాచ్ మెంట్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే జగన్ కేసులకు సంబంధించి సీబీఐ 11 ఛార్జ్ షీట్లు నమోదు చేసింది. తాజాగా నాలుగు ఛార్జిషీట్లకు సంబంధించి మనీలాండరింగ్ చట్టం కింద 1500 కోట్ల వరకు ఆస్తులు ఈడీ అటాచ్ చేసే అవకాశం ఉంది. అలాగే జగన్ కేసులో క్విడ్ ప్రో కో జరిగిందని ఇప్పటికే ఈడీ నిర్ధారణకు రావడంతో ఈ కేసులో మిగతా వాళ్లకు అటాచ్ మెంట్ దెబ్బ తగలనుంది.

ఇప్పటికే జగన్ ఆస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ ను ఈడీ విచారించింది. దీంతో వాన్ పిక్ వ్యవహారంలో తాజా అటాచ్ మెంట్స్ ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే నిమ్మగడ్డ ప్రసాద్, జగన్ ఆస్తులకు సంబంధించి 863 కోట్ల అటాచ్ మెంట్ కు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఇదే కేసుతో లింక్ ఉన్న ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ కు చెందిన ఆస్తుల్లో వేటిని అటాచ్ చేయాలో ఇప్పటికే ఈడీ ఓ నిర్ధారణకు వచ్చిందని తెలుస్తోంది.

మరోవైపు రఘురాం సిమెంట్స్ ఛార్జీషీట్ ఆధారంగా బీసీసీపిఎల్ డైరెక్టర్ జి.బాలాజీ ఆస్తుల వివరాలపైనా ఈడీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. రఘురాం సిమెంట్స్ వ్యవహారంలో జగన్, దాల్మియా సిమెంట్స్ మధ్య 95 కోట్ల మేరకు చేతులు మారాయని ఇప్పటికే సీబీఐ ఛార్జీషీట్ లో తెలిపింది. ఈడీ ఈ సంస్థల ఆస్తులనూ అటాచ్ చేయబోతోందనే సమాచారం నిందితులకు గుబులు రేపుతోంది. మరి జగన్ కేసులో ఈడీ చూపిస్తున్న జోరు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY