కోడిపందేల పై కన్నేసిన చంద్రబాబు

0
256

12-chandrababu-naidu-600

నవ్యాంధ్ర అభివృద్ధి కార్యాచరణలో భాగంగా ఇప్పుడ చంద్రన్న కన్ను పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం పై పడింది. ఇప్పటివరకు ఒక క్రీడ గా జంతు హింస గానే కనిపించిన కోడిపందేలను తొలి సారిగా ఆయన తెలివితేటలతో ఒక ఆదాయవనరుగా మార్చే ఆలోచన చేస్తున్నారు.

స్పెయిన్ లో జరిగే బుల్ ఫైట్ లాగానే మన కోడిపందేలను కుడా ప్రపంచానికి పరిచయం చేస్తే దాని ద్వార పర్యాటకరంగం ఎంతో అభివ్రుద్ది చెందుతుంది, కోడి కాలుకి కత్తి కట్టకుండా, బెట్టింగ్ లేకుండా ఈ పందేలను నిర్వహిస్తే తప్పేంటి అని గురువారం ఆయన స్థానిక కలెక్టర్ లను, సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించారు.

65 రకాల వంటలకు ఆలవాలమైన భీమవరం లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించి మన రుచులను విశ్వవ్యాప్తం చేస్తే, గోదావరి జిల్లాలో దొరికే మాంసపు పచ్చళ్ళు, ఆక్వా వంటకాలు పర్యాటకులకు వండి వడ్డిస్తే రవాణా, ఆహరం, బస మొదలైన విషయాలలో ఎంతో ఆదాయం వస్తుంది అని అయన అన్నారు. మనకున్న ఆధ్యాత్మిక కేంద్రాలను ఆదాయ వనరులుగా మార్చే దిశగా ఆలోచించమని చంద్రబాబు వారిని కోరారు.     

NO COMMENTS

LEAVE A REPLY