బస్సులో రేప్ చేసిన డ్రైవరు, కండక్టర్లు

0
225

rape

క్యాబ్ లు, ఆటోలు.. చివరికి బస్సుల్లో కుడా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. కదులుతున్న బస్సులో ఓ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఉదంతం రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలోని పిలానీ ప్రాంతంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని పిలానీ నుంచి హరియాణాలోని లోహారుకు వెళ్తున్న స్లీపర్ బస్సులో ఈ ఘటన జరిగింది.
‘బస్సులో నేను ఒక్కదానినే ఉన్నాను. మొదట నాపై కండక్టర్ కాలియా అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత డ్రైవర్ కూడా నాపై అత్యాచారం చేశాడు. అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో వదిలివెళ్లారు’ అని ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొందని పోలీసు అధికారొకరు తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY