పవన్ కల్యాణ్ హటావో-పాలిటిక్స్ బచావో……

0
330

pawankalyan hatavo

అధికారం కోసం ..ప్రశ్నించడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానంటూ చెబుతున్న పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తున్నాడు రచయిత బొగ్గుల శ్రీనివాస్, హైదరాబాదు తార్నాకకు చెందిన బొగ్గుల శ్రీనివాస్ ఇటీవల ‘పవన్ కల్యాణ్ హటావో-పాలిటిక్స్ బచావో’ అనే పుస్తకం రాశారు. అయితే ఈ పుస్తకంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కేంద్రమంత్రి చిరంజీవి స్థాపించిన  ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్ ‘కామన్ మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్’అనే పేరుతో ఓ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే .ఆ సంస్థపేరుతో పవన్ కొన్ని కోట్లు వసూలు చేశాడని, ఇప్పటి వరకు వాటి లెక్కలు చెప్పలేదని ,ముందు వాటిని ఏం చేశాడో చెప్పాలని  శ్రీనివాస్ పవన్ కల్యాణ్ ను ప్రశ్నించనున్నాడు.రాజకీయాల్లో కొనసాగే హక్కు అర్హతలేదని?,తెలంగాణ మీద ప్రేమ వుందా..?సీమాంధ్ర మీద ప్రేమ వుందా..? లేక ఈ రెండింటి కన్నా డబ్బుమీదే ఎక్కువ ప్రేమ వుందా…? ఇలాంటి ప్రశ్నలన్నీ తన పుస్తకంలో సంధించారు.

                   కాగా  ఈ పుస్తకాన్ని బుధవారం హైదరాబాదులో ప్రారంభమయ్యే బుక్ ఫెయిర్ లో విక్రయించేందుకు నిర్ణయించారు. అయితే, నటుడు పవన్ కల్యాణ్ నుంచి, ఆయన అభిమానుల నుంచి తనకు ముప్పు ఉందని పుస్తక రచయిత శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై, నాయిని స్పందించారు. శ్రీనివాస్ కు పూర్తి రక్షణ కల్పిస్తామని, పుస్తక విక్రయాలు సజావుగా సాగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రత్యేక బాధ్యతలను డీసీపీ కమలాసన్ రెడ్డికి అప్పగించారు.

Source:6tv

NO COMMENTS

LEAVE A REPLY