సెల్ఫీలు తీసుకునే ముందు…

0
315

SELFIE

ఫేస్‌బుక్‌లో సెల్ఫీ పోస్టు చేయడం… దానికొచ్చే లైక్‌లూ, కామెంట్లూ చూసుకుని ఆనందించడం.. చాలామంది అమ్మాయిలు చేసే పనే. అయితే సెల్ఫీలు తీసుకునే ముందూ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మీరు ఫొటో తీసుకుంటున్నప్పుడు మీ వెనకాల అనవసరమైన వస్తువులూ, గోడలపై వేలాడదీసిన ఫొటోలూ వచ్చేయొచ్చు. అందుకే సెల్ఫీ తీసుకునే ముందు బ్యాక్‌గ్రౌండ్‌ని గమనించుకోవాలి. అనవసరం అనుకున్నవి మీ వెనకాల లేకుండా చూసుకోండి. కేవలం మీరు వేసుకున్న నగలూ, కళ్లద్దాలూ మాత్రమే హైలెట్ అయ్యేలా చూసుకోండి. సెల్ఫీ అయినా సరే పెదవులకు కొద్దిగా లిప్‌గ్లాస్ అద్దుకోవడం అవసరం.
మీ ఫోనుని నలభై అయిదు డిగ్రీల కోణంలో ఉంచి.. అప్పుడు ఫొటో తీసుకోండి. అయితే అన్నిసార్లూ ఇది సరిపోకపోవచ్చు అందుకే ఫోనుని రకరకాల యాంగిల్స్‌లో పెట్టుకుని ఫొటో తీసుకుని.. నచ్చిన సెల్ఫీనే ఫేస్‌బుక్‌లో ఉంచండి. సెల్ఫీ ప్రకాశవంతంగా, అందంగా రావాలంటే.. కాసేపు ఫోన్ కవర్‌ని తీసేసి సెల్ఫీ తీసుకోండి. వాటిని తీసుకుంటున్నప్పుడు కొందరు సినిమా తారల్ని అనుకరిస్తుంటారు. కానీ దానివల్ల అనుకున్నట్లుగా రాకపోవచ్చు. మీదైన స్త్టెల్‌లో ప్రయోగాలు చేసుకుని తీసుకోవడమే మంచిది. క్లిక్‌మనిపించేముందు తప్పనిసరిగా వెలుతుర్ని గమనించుకోండి. సహజ వెలుతురులో తీసుకుంటే సెల్ఫీ బాగా వస్తుంది. సెల్ఫీ తీసుకునే ముందు ఫ్రంట్ కెమెరాతో వద్దు. ఫొటోలో నాణ్యత ఉండదు.
ట్వీక్, ఫొటోషాప్, కలర్ కరెక్షన్, ఫొటో ఎడిట్.. లాంటి యాప్‌లు ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. వాటిని మీ ఫోనులో డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు తీసుకున్న ఫొటోలకు ఈ యాప్స్ ద్వారా చిన్నచిన్న మార్పులు చేస్తే ఫొటో చక్కగా వస్తుంది. ముఖ్యంగా కళ్లకింద ఉండే నల్లని వలయాల్లాంటి వాటిని సరిదిద్దుకోవచ్చు.

Selfie-Gone-Bizarre if selfie goes woring

NO COMMENTS

LEAVE A REPLY