మల్టీ స్టారర్ గా తెరకెక్కబొతున్న తెలుగు “బెంగుళూరు డేస్”..?

0
238

merged-image

కేరళ లో మే ౩౦ న రిలీజ్ అయ్యి మలయాళ చిత్ర సీమ లో సంచలనం సృష్టిస్తున్న చిత్రం “బెంగుళూరు డేస్”. చిన్న చిత్రం గా రిలీజ్ అయ్యి ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తుంది. ఈ చిత్రం యొక్క రీమేక్ హక్కులకు ఎన్నో బడా నిర్మాణ సంస్థలు పోటి పడగా “పి.వి.పి సంస్థ మరియు దిల్ రాజు” సంయుక్తంగా దక్కించుకొన్నారు. మలయాళం లో చిన్న నటులతో నిర్మితమైన ఈ చిత్రం తెలుగు, తమిళం మరియు హిందీ లో మల్టీ స్టార్ తో  రీమేక్ చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం యువతరం కథతో నిర్మితమైన చిత్రం కావడంతో యూత్ లో క్రేజ్ వున్న సిద్ధార్థ్, సమంత, నాగ చైతన్య మరియు నాని లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వినికిడి. ఒక్క నాగ చైతన్య కి తప్ప మిగతా నటీనటులకు తెలుగు మరియు తమిళ్ లో మంచి మార్కెట్ ఉండడం చేత వీరిని సంప్రదిస్తున్నారు. సో అంతా అనుకోనట్టు జరిగితే తెలుగులో  మరో మల్టీ స్టార్ సినిమా చూడొచ్చు………

NO COMMENTS

LEAVE A REPLY