” ఆగస్టు 15న ” తేలనున్న “జనసేన”…

0
286

pawan_kalyan_4

” పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ” మానసపుత్రిక ” జనసేన పార్టీ ” కనుమరుగు అవ్వబోతుంది అనే పుకార్లు చాలానే వచ్చాయి… అసలు జనసేన ఎందుకు పెట్టారో కుడా పూర్తిగా ప్రజలకి అర్ధం కాలేదు… కాంగ్రెస్ ని ఓడించడానికి బిజెపి మరియు టిడిపికి మద్దతు ఇచ్చి ఎన్నికలలో వాటి తరుఫున ప్రచారం చేశారు.. ఓట్ల  చీలిక ఇష్టం లేక ఎన్నికలలో పోటి చెయ్యట్లేదు అని ప్రకటించి సాటి ఓటరు అభిమానం సంపాదించారు… నేను మీకు తోడుగా ఉంటాను అని బాసలు చేశారు… అనుకున్నట్టుగానే టిడిపి మరియు బిజెపి విజయపతాకం ఎగురవేశారు… 

తరువాత పవన్ సినిమాలపై దృష్టి పెట్టారు..” గోపాల గోపాల ” మరియు ” గబ్బర్ సింగ్ 2 ” తో బిజీగా ఉన్నారు, పార్టీ  వ్యవహారాలు తెర వెనుక నుండి నడిపిస్తున్నారు , మొన్న జరిగిన బస్సు దుర్ఘటనలో గాయపడిన వారిని పలుకరించి తన పెద్ద మనసు చాటుకున్నారు …అయితే  ” జనసేన” లక్ష్యం గురించి కానీ వచ్చే ఎన్నికల ఎజెండా గురించి కానీ  చెప్పలేదు…”  ఇంక ఇంతటితో జనసేన ప్రయాణం ఆగిపోయినట్టేనా ? ” అనే సందిఘ్ధం జనంలో మొదలైంది.. నాయకులు పార్టీని విమర్శించడం మొదలెట్టారు… ” పవన్ ” వీటికి స్వస్తి పలకాలి అనుకుంటున్నటు సమాచారం… ” ఆగస్టు 15న ”  మళ్ళీ జనం ముందుకు వచ్చి పార్టీ ఎన్నికల గుర్తును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు  జిల్లాల వారీగా తాత్కాలిక కమిటీలను నియమించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. పిడికిలి గుర్తును  పార్టీ సింబల్ గా   ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయ్ . హైదరాబాద్ మేయర్ ఎన్నికల్లో పోటీకి దిగాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్న నేపథ్యంలో… పార్టీని మరింత బలవంతం చేస్తారా ? లేదా విలీనం చేస్తారా అనే ప్రశ్నలకు సమాధానం ” ఆగస్టు 15న ” తెలుస్తుంది….

NO COMMENTS

LEAVE A REPLY