వేగం పెంచారట…..

0
359

AlluArjun_Cameo

అవతలి వ్యక్తులు ఎగతాళి చేస్తుంటే వారికి సమాధానం చెప్పాలని కసిగా పనిచేస్తారు. కానీ అది కాకపోతే చాలా బాధపడతారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇలాగే బాధపడుతున్నారట. అల్లు అర్జున్ తో ఈ డైరెక్టర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాయిని శిల్పి ఓపిగ్గా చెక్కినట్లుగా.., సినిమాను చాలా ఓపిగ్గా సమయం తీసుకుని శ్రీనివాస్ తెరకెక్కిస్తాడు.అయితే నరం లేని నాలుకతో కొందరు, త్రివిక్రమ్ కు వేగంగా సినిమాలు తీయటం రాదబ్బా అనేశారు. ఈ విషయం డైరెక్టర్ కు తెలిసి చాలా ఫీల్ అయ్యారట.

త్వరత్వరగా సీన్లు షూట్ చేస్తున్నారు. దీంతో ఫిబ్రవరి 5న సినిమా విడుదల అవుతుందని అంతా అనుకున్నారు. ఎంత వేగం పెంచినా.., షూటింగ్ మాత్రం ఎప్పటిలాగే ముందుకు సాగుతోంది. దీంతో విడుదల తేదీని మార్చి 28కి మార్చేశారు. మళ్ళీ అనుకోని కారణాల వల్ల విడుదల ఏప్రిల్ కు వాయిదా పడింది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ సినిమా ఎప్రిల్ 2న విడుదల చేస్తారు అని చెప్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ వెడ్డింగ్ ప్లానర్ గా కన్పించనున్నాడు. ఈ ఏడాది వేసవిలో విడుదల అవుతున్న ఈ సినిమా ‘జులాయి’ని మించిన హిట్ సాధిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY