“అఖిల్” మూవీని తిరస్కరించిన “అలియా భట్”

0
344

akhil-alia-bhatt

తెలుగులో సినిమా ఆఫర్ ఇస్తానంటే ఇప్పుడు నాకు టైం లేదు అని చెప్పిందట. దీంతో ఇంకో హీరోయిన్ కోసం వెతుకులాటలో పడింది  అక్కినేని ఫ్యామిలి. ఈ స్టోరి అంతా అక్కినేని కుటుంబం నుంచి హీరోగా వచ్చేందుకు వెయిట్ చేస్తున్న అఖిల్ గురించే. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అలియా భట్ ఇప్పుడిప్పుడే ఇండస్ర్టీలో బిజీ అవుతోంది. అమ్మడు చేసిన సినిమాలన్నీ షాకింగ్ హిట్లే. దీంతో తెలుగులో కూడా హిట్ కొట్టించాలని భావించి అఖిల్ మూవీ యూనిట్ అలియాను కలిసిందట. తెలుగులో అఖిల్ పక్కన హీరోయిన్ గా నటించాలని కోరిందట. అయితే అప్పటికే మిగతా సినిమాలకు డేట్లు ఇచ్చేయటంతో ఇప్పుడయితే సినిమా చేయలేను అని సున్నితంగా తిరస్కరించిందట.

అఖిల్ తొలి సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. మూవీకి డైరెక్షన్ చేయనున్న వినాయక్ తల్లి ఇటీవలే చనిపోవటంతో కొద్ది రోజులు ఆలస్యంగా సినిమా ప్రారంభం అవుతుందని సన్నిహితులు చెప్తున్నారు. నాగార్జున, సుధాకర్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నాడు. అఖిల్ కు భారీ ఎంట్రీ లభించేలా వినాయక్ కథను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. సినిమా విడుదల కాకముందే హీరోగా చాలా క్రేజ్ సంపాదించుకున్న అఖిల్ మూవీ ఎప్పుడు వస్తుందా అని అక్కినేని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY