భారీ బాంబు పేలుడు, 58 మంది మృతి

0
186

pakistan bomb blast

పాకిస్థాన్ మరోసారి నెత్తురోడింది. సింధ్ ప్రావిన్స్ లోని షికార్ పూర్ నగరంలోని లఖీ దార్ ప్రాంతంలో ఉన్న షియా మసీదులో శుక్రవారం భారీ బాంబు పేలుడు సంభవించి 58 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. మసీదులో మెట్ల దగ్గర బాంబు పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. దాదాపు 5 కేజీల పేలుడు పదార్థం ఉపయోగించినట్టు బాంబు స్క్వాడ్ గుర్తించింది. ఓ కుర్రాడు ఈ బాంబు పెట్టినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పేలుడు సమయంలో మసీదులో దాదాపు 600 మంది ఉన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY