13వ ‘సంతోషం’ అవార్డ్ వేడుక

0
492

santosham invt copy

కళాకారులకు సంపూర్ణమైన ‘సంతోషం’ లభించేదెప్పుడు… వాళ్లు చేసిన సినిమా మంచి విజయం సొంతం చేసుకున్నప్పుడు. ఆ విజయం తాలూకు ‘సంతోషం’ రెట్టింపు అయ్యేదెప్పుడు.. అవార్డులు, రివార్డులు పొందినప్పుడు. అవార్డు రూపంలో ప్రతిభకు తగ్గ పట్టం కట్టినప్పుడు నూతనోత్సాహం కళాకారుల్లో కనిపిస్తుంది. అలా గత పన్నెండేళ్లుగా ఎంతోమంది కళాకారులను గౌరవించి, వాళ్లని సంతోషపెట్టిన ‘సంతోషం’ సురేశ్ కొండేటి ఇప్పుడు పదమూడవ అవార్డుల వేడుకను అంగరంగ వైభవంగా జరపడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు ‘సంతోషం’ పత్రికాధినేతగా, పంపిణీదారుడిగా, నిర్మాతగా అంచలంచెలుగా ఎదిగిన సురేశ్ కొండేటి తనకెంతో ఇచ్చిన పరిశ్రమకు తిరిగి ఏదో చేయాలనే సంకల్పంతోనే ‘సంతోషం’ అవార్డులు ప్రవేశపెట్టారు.

ఈ పన్నెండేళ్లల్లో ‘సంతోషం అవార్డు’ వేడుక కొత్త కొత్త పుంతలు తొక్కుతూ వస్తోంది. ముందు ఒక్క తెలుగు పరిశ్రమకు మాత్రమే పరిమితమైన అవార్డులు.. ఇప్పుడు ఇతర భాషలకు కూడా విస్తరించాయి. ఈ నెల 21న 13వ అవార్డుల వేడుకను అంగరంగ వైభవంగా జరపడానికి సురేశ్ కొండేటి సర్వ సన్నాహాలు చేస్తున్నారు. ఎప్పటిలానే ప్రముఖ తారలందర్నీ ఒకే వేదికపైకి తీసుకురానున్నారు.

సమంత, కాజల్ అగర్వాల్, ఇలియానా వంటి కథానాయికలకు ఆల్రెడీ ఆహ్వాన ప్రతికలు అందాయి. ఈ ముద్దుగుమ్మలు వేడుకలో పాల్గొనడానికి సుముఖత వ్యక్తపరిచారు. అలాగే, ‘మనం’ దర్శకుడు విక్రమ్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ‘సంతోషం’ అవార్డు వేడుకలో పాల్గొనడానికి ఉత్సుకతను వ్యక్తపరిచారు. ఒక్కరా? ఇద్దరా? ఇలా ఎంతోమంది తారలతో కనువిందుగా జరగనున్న ఈ వేడుకలో తెలుగు, తమిళ. మలయాళ, కన్నడ భాషలకు చెందిన తారలు అవార్డులు అందుకోనున్నారు.

ఈ నెల 21న జె.ఆర్.సి. కన్వెన్షన్ హాలులో సాయంత్రం ఐదు గంటల నుంచి ‘సంతోషం’ అవార్డుల సందడి ఆరంభం కాన

NO COMMENTS

LEAVE A REPLY