I.T courseలు easy

0
657

download

ఐ.టి బ్యాక్ గ్రౌండ్  లేని వారి ఇబ్బంది.

నేను ఐ.టి బ్యాక్ గ్రౌండ్ కాదు. కాని మంచి ఐ.టి కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను ఎలానో చెప్పండి అని అడుగుతారు. ఈ ప్రశ్న విన్న చాలా మంది …కష్టం అని చెపుతారు కాని, సరయిన సబ్జెక్టు నేర్పించే వారు దొరికితే ఐ.టి కోర్స్ ని ఒక చుట్టూ చుట్టి పక్కన పెట్టొచ్చు.

 • మనకి ప్రోగ్రామింగ్ రాదూ ,చాలా కష్టం ఏమో,మనకి అర్ధం అయ్యేలా ఎవరు నేర్పుతారు అనే అనుమానంతో ఆగిపోతారు.
 • కొంత మంది ఇంటి నుండి బయటకు వెళ్లి నేర్చుకునే పరిస్థితి ఉండదు.
 • ఏదయినా ఆక్సిడెంట్ జరిగి ఇంటి నుండి కదలలేని పరిస్థితి .
 • ఇంకొంతమందికి కొంత ఏజ్ వచ్చేసి ..ఈ వయసుల్లో బయటకు వెళ్లి ఏమి నేర్చుకుంటాములే అనే భావన ఉంటుంది.
 • ఇక ముఖ్యంగా మహిళలు …ఇంట్లో ఉంటూ ఏదయినా సాదించాలి అనే తపన ఉంటుంది కాని బయటకు వెళ్లి నేర్చుకునే టైం ఉండదు.
 • ఇక ఐ.టి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఏదయినా వెబ్ సైట్ డెవలప్ చెయ్యాలి , గేమ్ రూపొందించాలి , మొబైల్ ఆప్ చెయ్యాలి లాంటి ఆలోచనలు ఉంటాయి కాని ఎలానో తెలియదు..ఎక్కడ మొదలుపెట్టాలో తెలియదు.

వీరి లాంటి వారికి బేసిక్స్ నుండి సబ్జెక్టు నేర్పే వారు కావలి. ఎన్ని సార్లు అయినా క్లాసు చూసుకునే విధంగా ఉండాలి.
వారికి కావాల్సిన టైం లో నేర్చుకునే విధంగా ఉండాలి.

ఐ.టి లో జాబ్ కోసం చూసే fresher లకి :

fresher లు జాబ్ రావటం ముఖ్యం. కాని జాబ్ వచ్చాక దానిని నిలబెట్టుకోవటం అంత కంటే ముఖ్యం
మరి దానికి నువ్వు చేయబోయే జాబ్ పైన పట్టు ఉండాలి. ఆఫీసు లో ఏదో నేర్పిస్తారు అనుకోబాకు..ఆఫీసులో జాయిన్ అయితే తెలుస్తుంది ఏమి నేర్పిస్తారో.
మరి వీరికి మంచి టెక్నికల్ సబ్జెక్టు నేర్చుకునే సదుపాయం కావాలి.

వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వారికి :

వీరిలో రొండు టైపులు. ఒకటి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబు  చేసే వారు. రొండోది వర్క్ చేస్తూ  పై లెవెల్ కి  వేలటానికి  తమ స్కిల్స్ పెంచుకోవాలి అనుకునేవారు.
అటువంటి వారికి మంచి సబ్జెక్టు నేర్చుకోవటం ఎంత ముఖ్యమో నేను చెప్పకర్లేదు …
వీరికి టైం కుడా చాలా ముఖ్యమయినది.ఎప్పుడు కావాలి అంటే అప్పుడు నేర్చుకునే విధంగా ఉంటె ఉపయోగం.మరి వీరికి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ నేర్పించే కోర్స్‌లు కావాలి.

www.teamtreehouse.com website :

పైన చెప్పుకున్న అందరిని టార్గెట్ చేస్తూ  www.teamtreehouse.com వెబ్ సైట్ ఆన్ లైన్ లో మంచి ట్రైనింగ్ అందిస్తుంది.

ఇది ఫ్రీ వెబ్ సైట్ కాదు. ప్రతి నెల కొంత ఫి కడితే మనకు నచ్చిన కోర్స్ నేర్చుకోవచ్చు .మంచి క్వాలిటీ ట్రైనింగ్ ఇచ్చే వెబ్ సైట్ . ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న వెబ్ సైట్ .

చాలా మంది నేర్చుకోటానికి మనీ కట్టటానికి ఆలోచిస్తారు ..ఏదయినా కోర్స్ నేర్చుకుంటున్నాము అంటే మనం మన భవిష్యత్తు కి పెట్టుబడి పెడుతున్నాము అని అర్ధం.

ఆన్ లైన్ లో మంచి సబ్జెక్టు చెప్పే సైట్లు చాలా ఉన్నాయి కాని ఈ వెబ్ సైట్ ప్రత్యేకత ఏంటి అంటే దీనిలో ఐ.టి బ్యాక్ గ్రౌండ్ లేని వారిని కుడా దృష్టిలో పెట్టుకొని కోర్స్‌లు డిజైన్ చేసారు.

ఎటువంటి కోర్స్ లు నేర్చుకోవచ్చు :

HTML.
CSS.
PHP
Andriod.
ios.
Phython.
RubyonRails
WordPress.  లాంటి కోర్స్‌లు అన్ని కలిపి 1000 కి పైగా క్లాసులు ఉన్నాయి.

 TeamTreeHouse Pricing  వీవరాలు :

దీనిలో రొండు మోడల్స్ ఉన్నాయి.
Basic Plan—-దీని కాస్ట్ నెలకు 25$ . అంటే మన కరెన్సీలో దగ్గర దగ్గర 1500 Rs.
Pro Plan… దీని కాస్ట్ నెలకు 49$ అంటే మన కరెన్సీలో దగ్గర దగ్గర  3000 Rs.

రొండిటికీ తేడా ఏంటి అంటే …Pro Plan లో బోనస్ క్లాసులు ఉంటాయి అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్లాస్‌లు.
మరియు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ వీడియోలు అందుబాటులో ఉంటాయి.వీడియో క్లాసులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TeamTreeHouse 14 Day Free Trail :

అయితే , ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చాలి అని లేదు . ఈ వెబ్ సైట్ నాకు నచ్చింది  కాని మీకు ఎలా ఉంటుంది అనేది… మీ ఆలోచన , మీ అవసరం, మీ పరిస్థితి బట్టి ఉంటుంది.

మరి ఈ వెబ్ సైట్ లో క్లాసులు ఎలా ఉంటాయి …మీకు ఉపయోగపడుతాయా లేదా ? అని చూసుకోటానికి Free Trail అనే option ఉంది .

అంటే మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు మీ క్రెడిట్ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు 14 డే Free Trail పీరియడ్ అనేది వస్తుంది .ఈ 14 రోజులకి మీకు ఎటువంటి ఛార్జ్ ఉండదు . ఫ్రీ గా కోర్స్ నేర్చుకోవచ్చు.

మీకు అంతా నచ్చి 14 రోజుల తారువాత కంటిన్యూ చేస్తే ..నెలకు మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లాన్ బట్టి 25$ లేదా 49$ కట్ అవుతుంది .
14 రోజులలో మీకు నచ్చకపోతే ..సెట్టింగ్ లలో “cancel My account” ఆప్షన్ క్లిక్ చేస్తే మీ ఎకౌంటు cancel అవుతుంది .
ఎటువంటి మనీ కట్ కాదు .

www.teamtreehouse.com  link

TeamTreeHouse లో ప్లస్ పాయింట్ లు :

 • Project :ఏదయినా క్లాసు లు నేర్చుకున్నాక  మీరు ఒక ప్రాజెక్ట్ చెయ్యాలి అంటే, ప్రాజెక్ట్ సెక్షన్  లోఏదో ఒక ప్రాజెక్ట్ ఎంచుకోవచ్చు.బహుసా ఒక గేమ్ డిజైన్ చెయ్యాలి అంటే , ” ఎలా మొదలుపెట్టాలి, step bu step ఎలా చెయ్యాలి అనేది వివరంగా క్లాసులు ఉంటాయి .వెబ్ సైట్ సిబ్బంది సపోర్ట్ కుడా ఉంటుంది.
 • Practical Work: మీరు నేర్చుకున్న సబ్జెక్టు టెస్ట్ చేయటానికి .. Quizలు ఉంటాయి .అలానే మీరు ప్రాక్టికల్ గా చేయతానిక్ “Work Space లు ” ఉంటాయి, అంటే ప్రాక్టికల్ గా కోడ్ రాసి రన్ చేయ్యోచు.
 • Points & badges :మీరు ఒక కోర్స్ నేర్చుకునే విధానం బట్టి ..మీకు పాయింట్స్ ఇస్తారు. అలానే మీరు ఎటువంటి లెవెల్ లో ఉన్నారో గుర్తించటానికి Badges ఉంటాయి .
 • Forum :బయట కోర్స్ నేర్చుకునే ఇంకో ప్రదమ ఉద్దేశం ..డౌట్లు ఉంటె ట్రైనర్ ని కాని, క్లాసులో ఉన్నోడిని గాని అడగచ్చు అని.మరి అటువంటి సదుపాయం ఇక్కడ కుడా ఉంది.ఫోరం ఉంటుంది . మనకి ఎటువంటి డౌట్ ఉన్నాగాని అక్కడ పోస్ట్ చేస్తే మన డౌట్ తీరుస్తారు.

TeamTreeHouse లో మైనస్  పాయింట్ లు :

 • కోర్స్ లలో క్లాసులు నెల నెల అనుసందిస్తారు. ఒకే సారి అన్ని క్లాసులు పెడితే నేర్చుకునే వారు త్వరగా కంప్లీట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
 • బిజీ గా ఉండే వారు ఒకటి రొండు నెలలలో కోర్స్ నేర్చుకోవటం కొద్దిగా కష్టం.వారు రొండు మూడు నెలలు కంటిన్యూ చెయ్యాల్సి రావొచ్చు.
 • కొన్ని కోర్స్‌లలో ఒక క్రమ పద్దతిలో క్లాసులు లేవు…నాన్ ఐ.టి బ్యాక్ గ్రౌండ్ వారు కొద్దిగా అవుతారు.

మరి ఈ లింక్  క్లిక్ చేసి  www.teamtreehouse.com జాయిన్ అయ్యి మీకు నచ్చిన కోర్స్ నేర్చుకోండి.

14 డే Free Trail తరువాత వద్దు అనుకునే వారు, ఒక రోజు ముందుగానే account cancel చేసుకోండి. అలానే మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి ..లేదంటే ఫస్ట్ నెల అమౌంట్ కట్ అవుతుంది.

నేనువ్యక్తిగతంగా ఈ వెబ్ సైట్ నుండే  Andriod,HTML5 ,Wordpress లాంటి కోర్స్‌లు చదవుతున్నాను.ఆన్ లైన్ లో నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వారికి నేను పర్సనల్ గా ఈ వెబ్ సైట్ ని recommend చేస్తాను.

sourse  http://www.smarttelugu.com/learn-it-courses-online/

NO COMMENTS

LEAVE A REPLY